2019 నుంచి ప్రధాని 21 విదేశీ పర్యటనలు

రూ.22.76 కోట్లకు పైగా ఖర్చు

0
TMedia (Telugu News) :

2019 నుంచి ప్రధాని 21 విదేశీ పర్యటనలు

-రూ.22.76 కోట్లకు పైగా ఖర్చు

టీ మీడియా, ఫిబ్రవరి 3, న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు, విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు అయింది అనే వివరాలను రాతపూర్వకంగా బహిర్గతం చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులుగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో రాతపూర్వకంగా వివరించారు. మోడీ విదేశీ పర్యటనల కోసం రూ.22.76 కోట్లకు పైగా ఖర్చు చేశారని ప్రభుత్వం గురువారం వెల్లడించింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 నుంచి ఇప్పటి వరకు 21 విదేశీ పర్యటనలు చేపట్టగా, ఈ పర్యటనల కోసం రూ.22.76 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాష్ట్రపతి ఎనిమిది విదేశీ పర్యటనలు చేశారు. 2019 నుండి ఈ పర్యటనల కోసం 6.24 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు, రాష్ట్ర మంత్రివిదేశీ వ్యవహారాలులో ఒక ప్రశ్నకు వి మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

Also Read : ఏపీలో పాగా వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు..

రాజ్యసభవిదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ చెప్పిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం అక్షరాల రూ. 22,76,76,934 కోట్లు ఖర్చు , రాష్ట్రపతి విదేశీ పర్యటనల కోసం రూ. 6,24,31,424 ఖర్చయింది. అదే సమయంలో విదేశాంగ శాఖ మంత్రి విదేశీ పర్యటనల కోసం రూ. 20,87,01,475 వెచ్చించారు. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 21 సందర్భాల్లో, ప్రెసిడెంట్ ఎనిమిదిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ 86 విదేశీ పర్యటనలకు వెళ్లినట్టు రాజ్యసభ సాక్షిగా వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube