తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

0
TMedia (Telugu News) :

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

టీ మీడియా, నవంబర్ 27, తిరుమల: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం దగ్గర టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో వేద పండితులు వేధ ఆశీర్వచనం ఇవ్వగా, టిటిడి చైర్మన్, ఈఓలు స్వామి వారి చిత్ర పటాన్ని బహుకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక తిరుమలలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలలో శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆలయంలో కేంద్ర బలగాల మోహరించారు. డ్యూటీ పాస్ ఉన్నవారికే ఆలయంలోకి అనుమతించారు.

Also Read : పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సులో మంటలు..

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube