ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు

1
TMedia (Telugu News) :

ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు

టీ మీడియా, డిసెంబర్ 5,సికింద్రాబాద్ :గత నెలలోనే తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ.. ఈ నెలలో మళ్లీ వస్తున్నారు. ఇటీవల తెలంగాణకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ కేటాయించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ఈ ట్రైన్‌ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెలలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలనే యోచనలో రైల్వే అధికారులు ఉన్నారు.

Also Read : విద్యుత్ వినియోగదారులకు షాక్

దీని కోసం ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారని తెలుస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంతో పాటు బీబీ నగర్ ఎయిమ్స్‌ను కూడా మోదీ ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాలకు రావాల్సిందిగా ప్రధాని మోదీని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. దీంతో మోదీ కూడా వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube