చెన్నై ఆస్నత్రిలో ప్రధాని సోదరుడు
టీ మీడియా, ఫిబ్రవరి 28,చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ప్రహ్లాద్ మోదీ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. దీనికి చికిత్స తీసుకునేందుకే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. తమిళనాడులోని కన్యాకుమారి, మధురై, రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటనకు ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.