ప్రధానమంత్రి దసరా కానుకగా..

ప్రధానమంత్రి దసరా కానుకగా..

1
TMedia (Telugu News) :

ప్రధానమంత్రి దసరా కానుకగా..

టీ మీడియా,సెప్టెంబర్ 30,ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా కానుకను ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న 5జీ సర్వీసులను ఆయన అందుబాటులోకి తీసుకుని రానున్నారు. దీనికి తేదీ కూడా ఖరారైంది. శనివారమే ఆయన 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ఈ లేటెస్ట్ 5జీ సర్వీసులను లాంఛనంగా ప్రారంభిస్తారు ఈ 9 నగరాల్లో.. దీనితో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌ సదస్సును కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

Also Read : ఏకే 47 బుల్లెట్లతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పేరు

ఇది 6వ ఎడిషన్. అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు ఈ సదస్సు కొనసాగుతుంది. కాగా- తొలి విడతలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన తొమ్మిది నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ జాబితాలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, గుర్‌గావ్, హైదరాబాద్, జామ్‌నగర్, లక్నో, పుణే నగరాలు ఉన్నాయి. మిగిలిన నగరాల్లో ఈ ఏడాడి డిసెంబర్ నాటికి దశలవారీగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube