పుస్తకాలు పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 31 వనపర్తి : వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ తన సొంత ఖర్చులతో ఉచితంగా పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయులు అతీఖ్ అహ్మద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ పరీక్షల మార్గదర్శనం చేసే ఈ స్టడీ మెటీరియల్ బుక్స్ తో మంచిగా ప్రిపేర్ చేసి ఉత్తమ ర్యాంకుతో స్కాలర్షిప్ సాధించాలని విద్యార్థులను కోరారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల ద్వారా ఎన్నుకోబడిన విద్యార్థులకు ఏడాదికి పన్నెండు వేలు చొప్పున 48 వేల స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఇష్టపడి చదివి విద్యావంతులై భరతమాత ముద్దుబిడ్డలుగా వెలుగొందాలని ప్రధానోపాధ్యాయులు హితోపదేశం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బి.కృష్ణ మరియు బి.శ్యామ్ ప్రసాద్ లు విద్యార్థులకు అవసరమైన సూచనలు మెలకువలను బోధించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube