పృథ్వీ-2 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

పృథ్వీ-2 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

0
TMedia (Telugu News) :

పృథ్వీ-2 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

టీ మీడియా, జనవరి 11, న్యూఢిల్లీ : భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. మంగళవారం రాత్రి ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. పృథ్వీ-2 క్షిపని కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ తెలిపింది.ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి అని, 350 కి.మీ. రేంజ్‌లోని లక్ష్యాలను ఛేదిస్తుందని వెల్లడించింది. పృథ్వీ సిరీస్‌లో రూపొందించిన ఈ బాలిస్టిక్‌ మిస్సైల్‌తో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరినట్లయిందని పేర్కొన్నది. స్ట్రాప్ డౌన్ సీరియల్ నావిగేషన్ సిస్టమ్‌పై నడిచే ఈ క్షిపణి 500 కిలోల వరకు పేలు పదార్థాలను మోసుకెళ్లగలుగుతుందని చెప్పింది.

Also Read : తిరుమల శ్రీవారి ఆదాయం రూ. 3.89 కోట్లు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube