ప్రయివేటు బస్సు బోల్తా
-22 మందికి గాయాలు
టీ మీడియా, నవంబర్ 1, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. గుడిపాల మండలంలోని చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సికింద్రాబాద్కు చెందిన లలిత (65), తమిళనాడులోని మానియంబాడికి చెందిన కుబేంద్రన్(35) తీవ్రంగా.. మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు.
Also Read : మణిపూర్‌లో తాజా హింసాకాండ
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube