టీ మీడియా,డిసెంబర్01,కరకగూడెం;
తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్, టెక్నీషియన్స్ ఫెడరేషన్ కరకగూడెం మండల నూతన కమిటీని బుధవారం మండలంలోని రాళ్లవాగు పెద్దమ్మతల్లి ఆలయం ప్రాంగణంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నోజు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు.మండల నూతన అధ్యక్షుడిగా శేరు శ్రీధర్,ఉపాధ్యక్షుడిగా కొండా పురుషోత్తం,ప్రధాన కార్యదర్శిగా బొంగొని వెంకటేష్,కోశాధికారి కొమురం సతీష్ కుమార్, ప్రచార కార్యదర్శి కొత్తకొండ మురళి,నల్లమాస రాజులను ఏన్నుకున్నారు.
అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం కరెంట్ షాక్ కు గురైన తాటిగూడెం గ్రామానికి చెందిన పూనెం నవీన్(ఎలక్ట్రిషన్)కు సంఘం తరుపున 3,516 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పూర్వ కమిటీ అధ్యక్షులుగా శక్తి వంచన లేకుండా పనిచేసిన దెంచనాల రాజేంద్రప్రసాద్ ను శాలవతో ఆ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం,పినపాక,మణుగూరు,అశ్వాపురం మండలాలకు చెందిన ముఖ్యమైన సంఘం నాయకులు పాల్గొన్నారు.