జోడో యాత్రలో ప్రియాంక గాంధీ
టీ మీడియా ,నవంబర్ 24,భోపాల్ : భారత జోడో యాత్రలో భాగంగా సోదరుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కలిసి నడిశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రోహిన్‌తో కలిసి గురువారం రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు.చెల్లెలితో కలిసి నడుస్తున్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేసిన రాహుల్.. ”మనం కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయంటూ” పేర్కొన్నారు.
Also Read : మంత్రి మల్లారెడ్డిపై కేసు.
ప్రియాంక వాద్రా భారత్ జోడోలో పాల్గొనడం ఇదే తొలిసారి. సోనియాగాంధీ కర్ణాటకలో రాహుల్‌తో కలిసి నడిశారు.సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర.. నవంబర్ 23న మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో ఐదు లోక్‌సభ, 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదకొండు రోజులపాటు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube