విజేతలకు బహుమతుల ప్రధానం

విజేతలకు బహుమతుల ప్రధానం

0
TMedia (Telugu News) :

విజేతలకు బహుమతుల ప్రధానం

టీ మీడియా, జనవరి 14, వనపర్తి బ్యూరో : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ కాలనీలో ముగ్గుల పోటీ స్కిప్పింగ్ స్పూన్ ఆటలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతి వినీషా, రెండవ బహుమతి సునీత కు ఇవ్వడం జరిగింది. మిగతా క్రీడల్లో పోటీల్లో వారికి కూడా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి గద్వాల సాయి లీల మాట్లాడుతూ ఆడ పిల్లను పుట్టనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం అనే నినాదంతో ముందుకు పోతున్నటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే అది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా మాత్రమే మహిళలు ప్రతి రంగంలో ముందుండాలని కోరుకుంటూ భవిష్యత్ కాలంలో ఇంకో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోదామని అన్నారు.

Also Read : ఘనంగా భోగి మంటలు

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎస్ లక్ష్మి, సుగుణమ్మ, వసంత, రంగమ్మ, భగత్ సింగ్ నగర్ కాలనీవాసులు చిన్నారులు మహిళలు పెద్ద ఎత్తులో పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube