వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి

కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన అధ్యక్షుడు జనార్దన్

0
TMedia (Telugu News) :

వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి

– కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన అధ్యక్షుడు జనార్దన్

టీ మీడియా, జనవరి 5, వనపర్తి బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రారంభించడం సంతోషకరం. కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మొదటి వారంలో మీ సేవ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి గాను వికలాంగులకు ఇచ్చే సమయపాలన కొంత సడలించి కనీసం నిర్ణయించిన తేదీ ఆరోజు మొత్తం ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. జిల్లాలో స్లాట్ బుకింగ్ కోసం ప్రతి నెల జిల్లావ్యాప్తంగా కేవలం 50 మందికి మాత్రమే అవకాశం ఇవ్వడం వలన చాలామంది వికలాంగులు మీసేవ సెంటర్ వద్దకు చాలా కష్టపడి ఆటోలలో సైకిల్, స్కూటర్ మీద ఒకరిని సహాయంగా వెంట తీసుకొని వెళ్లడం జరుగుతుంది.

Also Read : శోభాయాత్రను దిగ్విజయం చేయాలి

కొన్ని గంటల సమయం పాటు మీసేవ సెంటర్ వద్ద కూర్చుని అప్లై చేయడానికి కంప్యూటర్ వద్ద కూర్చుంటే వేలిముద్రలు రావడం లేదు. కొన్ని క్షణాలలోనే. కొన్ని నిమిషాలలోనే స్లాట్ బుకింగ్ సైట్ పోతుంది. ఈ సైట్ కనీసం ఒకరోజు మొత్తం ఉండాలి. కొన్ని మీసేవ సెంటర్లలో కనీసం ఒక్కరికి కూడా ఒక్క వికలాంగుడికి కూడా స్లాట్ బుక్ కావడం లేదు. ఈ స్లాట్ బుక్ కానీ వికలాంగులు ప్రతినెల మీసేవ సెంటర్ వద్దకు రావడం జరుగుతుంది. కొందరు వికలాంగులు సంవత్సరాలు రెండు సంవత్సరాల కానుండి తిరిగిన కూడా సదరం స్లాట్ బుక్ కావడం లేదు. మరొక ముఖ్య విషయం ఏమంటే వికలాంగులకు వారి యొక్క వైకల్యాన్ని బట్టి టెంపరరీ సర్టిఫికెట్లు 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలకు కాలపరిమితితో ఇచ్చే సదరం సర్టిఫికెట్లు సమయం అయిపోయిన తరువాత వికలాంగులు మళ్లీ సదరం సర్టిఫికెట్ కోసం రెన్యువల్ చేయడం కోసం మీ సేవ సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారి పోతున్నారు.

Also Read : రెడ్డి గార్డెన్ వైపు రోడ్డు వేయించండి

కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ ఎంజీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదరం సర్టిఫికెట్ స్లాట్ బుకింగ్ తేదీని ఒక రోజు మొత్తం ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని వికలాంగులు జిల్లా తరపున జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు, విజయ్, గోపీనాథ్, మహేశ్వరి, అన్నపూర్ణ, రాజు, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube