సమస్యలు పరిష్కరించాలి

-ఐసి డిఎస్ ప్రిన్సపల్ కార్యదర్శి కి వినతి

1
TMedia (Telugu News) :

సమస్యలు పరిష్కరించాలి

-ఐసి డిఎస్ ప్రిన్సపల్ కార్యదర్శి కి వినతి

టీ మీడియా,సెప్టెంబర్ 7,కడప:

అంగన్వాడి లకు ఉద్యోగోన్నతులకు అవకాశమివ్వాలని సిఐటియు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని బుధవారం స్థానిక కడప నగరంలోని
పోలీస్ అతిథిగృహంలో ఐసీడీఎస్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధకు జిల్లా ఐసీడీఎస్ పీడీ రాణి సమక్షంలో సిఐటియు నాయకులు విన తిపత్రం అందజేశారు.
అంగన్వాడీ గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల భర్తీలో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని అంగ న్వాడీల యూనియన్ (సిఐటియు అనుబంధం) ప్రతినిధులు కోరారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను ఆమెకు వివరించారు.యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్మిదేవి మాట్లాడుతూ అర్బన్, రూరల్ అనే తేడా. లేకుండా ప్రతి కార్యకర్తకు సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వం విడు దల చేసిన జీవో ప్రకారం ఒంటరి, వితంతు పింఛను, అమ్మఒడి పథకాలను వర్తింపజేయాలని కోరారు.

Also Read : ఐఐటీవిద్యార్థి ఆత్మహత్య.

నాణ్యమైన ఫోన్లు, వంట సామగ్రి అందించాలని పులివెందుల లో ధర్నా చేసిన సందర్భంగా ధర్నాలో పాల్గోన్న వారికి,అర్హత ఉన్న వారికి సూపర్ వైజర్ల పరీక్ష కు అనుమతి ఇవ్వాలని,12 వ తేదీ చివరి తేదీ…కాబట్టి ప్రాసస్ తొందరగా చేయాలని చెప్పినాము.సరే అన్నారు మేడం గారు.మిని వర్కర్స్ కు కూడ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ఆడిగినాము. మేడం గారు మొదట మెయిన్ వర్కర్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అర్హత ఉంటుంది అని అన్నారు.మేము తెలంగాణ లో జి ఓ ఇచ్చినారు అని చెప్పాము.జీఓ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలుఅమలు కాలేదు అని చెప్పాము…పరిశీలన చేస్తాను అన్నారు.రిటైర్మెంట్ అయిన వారికి బెనిఫిట్ రాలేదు అనగా.వివరాలు పీడీ గారికి ఇమ్మన్నారు. ఖాళీగా ఉన్న వర్కర్స్, హెల్పర్స్ పోస్టులు భర్తీ చేయాలని ,రెండు సార్లు నోటీపీకేషన్ రద్దు చేసినట్లు చెప్పాము….ఎందుకు అలా చేసినారు అని పీడీ గారిని అడిగిననారు…త్వరలో భర్తీ చేయాలని చెప్పారు….ట్యాబులు ఇవ్వాలని,కరోనా కాలం లో 10 శాతం జీతాలు కట్ చేసినారు…ఇవ్వ లేదని చెప్పాము..టి, ఏ .డి ,ఏ లు అడుగగా బడ్జెట్ లేదని అన్నారు….400 జనాభా దాటిన మిని వర్కర్స్ కు మెయిన్ వర్కర్స్ గా ప్రమోషన్లు ఇవ్వాలని…హెల్పర్స్ ను కూడ నియమించాలని ఆడిగినారు.


ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్సులు కామనురు శ్రీనువాసులురెడ్డి,మనోహర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మిదేవి, అర్బన్ ప్రాజెక్టు ఎం.పి అంజనా దేవి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube