ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు
– పురపాలక సంఘం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం
టీ మీడియా,ఆగస్టు 6, రామకృష్ణాపూర్:
క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ లో తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లో భాగంగా ఆదివారం మున్సిపల్ నర్సరీ ముందు గల తెలంగాణ క్రీడ ప్రాంగణము నందు పురపాలక సంఘము, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి 300 మొక్కలను నాటడం జరిగింది.ఈ కార్యక్రమము చైర్ పర్సన్ జంగం కళ ,కమిషనర్ జి.వెంకటనారాయణ, వైస్ చైర్మన్ అర్రం విద్యా సాగర్ రెడ్డి,కౌన్సిలర్లు రేవెల్లి ఓదెలు,జీలకర మహేశ్, కార్యాలయ సిబ్బంది,మెప్మా సిబ్బంది,పట్టణ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది.