వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వారావుపేట నవంబర్ 28

నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేట మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రెస్ క్లబ్ రెండవ సర్వసభ సమావేశం ఆదివారం స్థానిక ఖమ్మం రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ సర్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సీనియర్ రిపోర్టర్ ముజాఫర్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు ముద్దాల మృత్యుoజయుడు మాట్లాడుతూ నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సోషల్ మీడియాలో ఉరకలు పడుతున్న వేళ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న విలేకర్ల వృత్తి చాలా కఠినతరం అయిందని ప్రజలకు అధికారులకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున సరైన ఆదరణ లభించడం లేదని ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ALSO READ : రాష్ట్ర స్థాయి కరాటే ట్రోఫిల ఆవిష్కరణ బెల్టుల ప్రాధానోత్సవం .

ప్రభుత్వం జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు ఇస్తాను అని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా ఆ ఊసే ఉండటం లేదని అన్నారు.ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు అధికారులు అర్హులైన జర్నలిస్టుల సమస్యల కొరకు కృషి చేయవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెషర్ జయశంకర్ సార్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి వెంకటేశ్వరరావు, మట్లకుంట చంద్రశేఖర్,షేక్ మౌలాలి,సాయి,ధర్మ,సతీష్,అంజి,శేషు,చంటి, కేసిబోయిన వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube