దళిత వాడలు బంగారు మేడలు కావాలి

మంత్రి పువ్వాడ

0
TMedia (Telugu News) :

దళిత వాడలు బంగారు మేడలు కావాలి..

-మంత్రి పువ్వాడ.
టి మీడియా,జులై22, ఖమ్మం:
దళితులు ఆర్ధిక పురోగభివృద్ది
సాధించాలని, దళిత వాడలు బంగారు మేడలు కావాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు దలితబందు పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు.

రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో పూర్తి స్థాయిలో దళిత బంధు అమలులో భాగంగా నేడు లబ్దిదారులకు యూనిట్స్ ను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.దళితుల అభ్యున్నతికి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రణాళిక ప్రకారం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వారి కృషి వల్లనే ఈ పథకం ఇంత విజయం సాధ్యమైందన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి పథకం లేదని, ఈ పథకం దేశానికే ఆదర్శమని అన్నారు.
ఒక్క గ్రామంలోనే ఇంతటి మహత్తమైన పథకాన్ని మంజూరు చేయడం గల కారణాలను వివరించారు. మార్పు అనేది ఏదో ఒక దగ్గర నుండి మొదలవ్వాలని, ముందు దాని ప్రతిఫలం దళితులు అనుభవించాలి అన్న మంచి ఉద్దేశంతోనే ఈర్లపుడి గ్రామాన్ని ఎంచుకున్నమన్నారు.

 

Also Read : ప్రేమ పెళ్లికి సహకరించాలని కోరిన జంట

ఉన్న పథకాలు అక్కడ అక్కడ కొన్ని కొన్ని ఇస్తే ఎక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి కనిపించదని అన్నారు. కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ గారు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్‌ గారు చేసిన సంకల్పం నేడు సాకారమవుతుందని తెలిపారు. దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా దళిత బంధు పథకాన్ని ఆపేది లేదన్నారు.లబ్ధిదారుడి రూపాయి పెట్టుబడి కూడా లేకుండా దళిత బంధు పథకం ద్వారా వంద శాతం ప్రభుత్వ నిధులతో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజల కోసం ప్రాణం పెట్టి పని చేసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు అని అన్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న దళిత బంధు, షాదీముబారక్‌, రైతు బంధు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

 

Also Read : కాల్ గర్ల్స్ పంపుతా అనే మోసగాడు అరెస్ట్

దళిత బంధు పథకంలో దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసి లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు నిధిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఎలాంటి విపత్తులు వచ్చిన సంక్షమం, అభివృద్ది మాత్రం ఆగదని అన్నారు. గోదావరి వరద నుండి కేవలం మూడు రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకొచ్చి విద్యుత్ సరఫరాను యదాతథంగా పునరుద్దరీకరణ చేశారని, ఇంత పటిష్టంగా ఏ ప్రభుత్వం చేస్తుందో చెప్పాలన్నారు.అనంతరం లబ్దిదారులకు జేసిబిలు, ట్రాక్టర్లు, మిని వ్యాన్ లు, మొబైల్ టిఫిన్ వ్యాన్ లు పంపిణీ చేశారు. డైరీ ఫాం షేడ్, కిరణం, DJ, టైర్ పంక్చర్ షాప్ లను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఏలూరి శ్రీనివాస్ గారు, సుడా చైర్మన్ విజయ్ గారు, సర్పంచ్ దేవ్ సింగ్ , ఎంపిపి గౌరి తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube