ముస్లింలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
టీ మీడియా, డిసెంబర్ 2, వనపర్తి బ్యూరో : తెలంగాణ సీఏం కేసీఆర్ 2014, 2018 ఎన్నికలలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అంజాద్ అలీ డిమాండ్ చేశారు.ఆయన మధనాపురం మండలానికి సంబంధించిన రామన్ పాడ్ గ్రామంలో మైనార్టీ ముస్లిం నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన మాటలు సీఏం కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ముస్లింల సమస్యల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎండీ అంజాద్ అలీ మాట్లాడుతూ సీఏం కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు గత 8సం,7నెలలు పూర్తయిన కూడా ఇంకా నెరవేర్చలేదు. వాటిని ఇకనైనా కెసిఆర్ ప్రభత్వం నెరవేర్చి ముస్లిం మైనార్టీల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
Also Read : కంటైనర్ను ఢీకొట్టిన ఇసుక లారీ.
12% ముస్లిం రిజర్వేషన్ హామీ పెంచుతూ గెజిట్ ప్రకటించాలి.
వక్ప్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. దీనిని ఆపడానికి వక్ఫ్ బోర్డుకు జ్యూడిషల్ పవర్ కల్పించాలి. మైనార్టీ కమీషన్ ను వెంటనే నియమించాలి. పేద ముస్లిం చిరు వ్యాపారులకు రూ. 2 లక్షల సబ్సిడీ లోన్లను ఇవ్వాలి.
సుధీర్ కమీషన్ సూచనలను అమలు చేయాలి.ముస్లిం బంధు పథకం కుడా అమలు చేయాలి.పై డిమాండ్లను తక్షణమే అమలు చేసి మైనార్టీలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాo అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు ఎండీ ఖదీర్, రామన్ పాడ్ గ్రామ మాజీ ఉప్ప సర్పంచ్ ఎండీ కరీం, ఎండీ మహిముదు, ఎండీ హుసేన్ పాషా,గఫార్, షాబాజ్ ఖలందర్ తదితరులు పాల్గొన్నారు.