ముస్లింలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
టీ మీడియా, నవంబర్ 26, వనపర్తి బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014, 2018 ఎన్నికలలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు యంఏ.ఖాదర్ పాష డిమాండ్ చేశారు.ఆయన నివాసంలో జన సమితి నాయకులుతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన మాటలు సీఏం కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు, తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ముస్లింల సమస్యల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఖాదర్ పాష మాట్లాడుతూ సీఏం కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు గత 8 సంవత్సరాలు పూర్తయిన కూడా ఇంకా నెరవేరలేదు. వాటిని ఇకనైనా నెరవేర్చి ముస్లిం మైనార్టీల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకొస్తున్నాం.
Also Read : కానిస్టేబుల్స్‌పై దాడి
12% ముస్లిం రిజర్వేషన్ హామీ రిజర్వేషన్లు పెంచుతూ గెజిట్ ప్రకటించాలి.వక్ఫ్ బోర్డుకు జ్యూడిషల్ పవర్ కల్పించాలి.గత మూడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మైనార్టీ కమీషన్ ను వెంటనే నియమించాలి.పెండింగ్ లో ఉన్న ఇమామ్ ,మౌజమ్ ల జీతాలను వెంటనే చెల్లించాలి.మైనార్టీ ఫైనాన్స్ కార్పోషన్ నిధులు వెంటనే నిధులు విడుదల చేసి, పేద ముస్లిం చిరు వ్యాపారులకు రూ. 2 లక్షల సబ్సిడీ లోన్లను ఇవ్వాలి.
సుధీర్ కమీషన్ సూచనలను అమలు చేయాలి.ముస్లిం బంధు పథకం కుడా అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న షాదీ ముబారక్ చెక్కులను తక్షణమే విడుదల చేయాలి.పై డిమాండ్లను తక్షణమే అమలు చేసి మైనార్టీలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు రఘునాయుడు,టౌన్ ప్రధాన కార్యదర్శి శాంతారామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.