వ్యభిచారం నేరం కాదు

వ్యభిచారం చేస్తున్నప్పుడు పోలీసులు చూసినా నేరమే

1
TMedia (Telugu News) :

వ్యభిచారం నేరం కాదు

-సుప్రీంకోర్టు తీర్పు
-వ్యభిచారం చేస్తున్నప్పుడు పోలీసులు చూసినా నేరమే

టి మీడియా మే26, ఢిల్లీ:వ్యభిచారి, వెలయాలి పేరు ఏదైనా కానీ అది వినపడగానే ఆడాళ్ల మొహాల్లో చీదరింపు.. మగాళ్ల కళ్లల్లో కామం బుసలు కొడుతుంది. తన మీదే ఆధారపడ్డ కుటుంబం, వారిని బాగా చూసుకోవడం కాదు కదా.. కనీసం మూడు పూటలా వారికింత తిండి పెడితే చాలు అనుకునే పరిస్థితుల్లో తప్పనిసరై.. ఈ వృత్తిలోకి దిగుతారు. వారి గురించి చదవగానే కష్టపడి పని చేసుకోవచ్చు కదా.. ఇలాంటి దరిద్రపు పనులు ఎందుకు అంటారు. అయితే గౌరవ మర్యాదలు పొగొట్టుకుని బతకాలని ఎవరు కోరుకోరు కదా. కానీ పరిస్థితులు వారిని అలా మారుస్తాయి. అలాంటి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. వ్యభిచారానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

దీని ప్రకారం స్వచ్ఛంద వ్యభిచారం నేర కాదని.. సెక్స్‌ వర్కర్లను ఏవిధంగానూ వేధించరానదని.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్కడైనా దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడిన సెక్స్‌ వర్కర్ల ఫోటోలను మీడియా ప్రచురించరాదని స్పష్టం చేసింది. వారిపై భౌతికంగా, మాటలతో దాడి చేయకుండా.. పోలీసులు కనీస మర్యాద పాటించాలని నిర్దేశిస్తూ జస్టిస్‌ లావు నాగేశ్వరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

Also Read : మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌తో సీఎం కేసీఆర్ లంచ్

సెసె‍క్స్‌ వర్కర్ల పనిని ‘‘వృత్తి’’గా గుర్తించే ముఖ్యమైన క్రమంలో.. చట్టం ప్రకారం గౌరవం, సమాన రక్షణకు సెక్స్‌ వర్కర్లు అర్హులని వ్యాఖ్యానించింది. అలాగే సెక్స్‌ వర్కర్లను వ్యభిచార కూపం నుంచి రక్షించే సమయంలో.. సెక్స్‌వర్కర్ల ఫొటోలు, గుర్తింపును బయటపెట్టొద్దంటూ కోర్టు మీడియాకు ఆదేశాలు జారీ చసింది. ఐపీసీ సెక్షన్‌ 354సీ (ఇతరులు నగ్నంగా ఉన్నప్పుడు.. శారీరకంగా కలుసుకున్నప్పుడు తొంగి చూడడం లాంటి నేరం) కిందకే వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మీడియాకు జారీ చేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్స్‌వర్కర్లపై వేధింపులపై 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గావై, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు ప్యానెల్‌ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.

Also Read : పట్టపగలే వీధీ దీపాల వెలుగులు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు పోలీసులకు, మీడియాకు ఆదేశాలిచ్చింది. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీపీఏ (ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌) కింద అన్ని సంరక్షణ గృహాల్లో సర్వే నిర్వహించాలని సూచించింది. అక్కడ వయోజన మహిళలను బలవంతంగా నిర్బంధించినట్లు తేలితే.. వారి పరిస్థితులను సమీక్షించి నిర్దిష్ట గడువులోగా వారినిన విడిపించడానికి చర్యలు తీసుకోవాలి అని ఆదేశించింది. అలానే యూఐడీఏఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికెట్‌ను అనుసరించి సెక్స్‌ వర్కర్లందరికి ఆధార్‌ కార్డు జారీ చేయాలని.. వారి వివరాలు తీసుకొనెటప్పుడు ఎక్కడా సెక్క్‌ వర్కర్‌ అని పేర్కొనకూడదు అని ఆదేశించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube