ఇజ్రాయేలీయుల భద్రతను కాపాడండి
-కేంద్రం హెచ్చరికలు
టీ మీడియా, అక్టోబర్ 13, న్యూఢిల్లీ : ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు న్యూఢిల్లీలో హై అలర్ట్‌ను ప్రకటించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు చెలరేగనున్నాయనే ముందస్తు సమాచారంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు ఢిల్లీలో హై అలర్ట్‌ను ప్రకటించారు. ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదుల సంస్థల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్రం ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించింది. మొదటి విమానంలో 212 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెలీయుల భద్రతను కాపాడాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
ఇజ్రాయెల్ పర్యాటకులకు, దౌత్యవేత్తలు సహా సిబ్బందికి భద్రత పెంచాలని కోరింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు ఇప్పటికే యూదుల భద్రతకు హామీ ఇస్తూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. భారత్ కూడా ఈ మేరకు చర్యలు చేపట్టింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube