అధిక ధరలు పన్నుల వ్యతిరేకంగా నిరసన ధర్నా

-సిపిఐ, సిపిఐఎంఎల్ ప్రజాపంథా

0
TMedia (Telugu News) :

అధిక ధరలు పన్నుల వ్యతిరేకంగా నిరసన ధర్నా

-సిపిఐ, సిపిఐఎంఎల్ ప్రజాపంథా

టీ మీడియా,మే 25కరకగూడెం;

అధిక ధరలు పన్నుల భారాలకు వ్యతిరేకంగా ఈనెల 27న జరిగే నిరసన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం, సిపిఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు గద్దల శ్రీనివాసరావు, మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సన్నాహక సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ధరలు విపరీతంగా పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని
అన్నారు.

Also Read:ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్
అప్పుడు కరోనా బాధలు,ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్న ధరల బాధలతో కరువు వచ్చే ప్రమాదం ఉందని సూచించారు.ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం స్పందించి పేద ప్రజల కోసం ప్రజా వ్యతిరేక విధానాలు తొలగించాలని డిమాండ్ చేశారు.లేని యెడల ఈ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 27న నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం,సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కార్యదర్శులు కొమరం కాంతారావు, వంగరి సతీష్, తోలెం లక్ష్మయ్య,మండల నాయకులు ఊకే నరసింహారావు, బుడుగం సతీష్ తదితరులు పాల్గొన్నారు

 

Also Read:జ్ఞాపికను అందజేసిన డిప్యూటీ తహసీల్దార్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube