అగ్రిమెంట్ అమలుచేయాలని అడిగితే చావబాదుతారా?

లాఠీచార్జికి కారణమైన సి.ఐ.ఎస్.ఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలి

1
TMedia (Telugu News) :

అగ్రిమెంట్ అమలుచేయాలని అడిగితే చావబాదుతారా?

– లాఠీచార్జికి కారణమైన సి.ఐ.ఎస్.ఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలి

– సిఐటియు జిల్లా కమిటీ

టీ మీడియా,ఆగస్టు 22,గోదావరిఖని : ఎన్టీపీసీ లో కాంట్రాక్టు కార్మికులకు 2018 సంవత్సరంలో చేసిన అగ్రిమెంట్ ను అమలు చేయాలని సోమవారం జే.ఏ.సి. ఆధ్వర్యంలో నెంబర్-2 గేటు వద్ద సామరస్యంగా నిరసన తెలుపుతున్న క్రమంలో సి.ఐ.ఎస్.ఎఫ్.వారు ఎలాంటి హెచ్చరిక లేకుండా,విచక్షణా రహితంగా పశువులను బాదినట్లుగా లాఠీ ఛార్జి చేసారు. ఇది చాలా హేయమైన చర్య, ఈసంఘటనను సిఐటియు జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండించడం జరిగింది. విషయం తెలిసి సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్న జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి లాఠీచార్జి లో గాయపడిన కార్మికులను పరామర్శించి మాట్లాడారు. వందలాదిమంది కాంట్రాక్టు కార్మికులపై లాఠీచార్జి కి ఉసిగొల్పిన ఎన్టీపీసీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలన్నారు.

 

Also Read : ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు

 

కార్మికులపట్ల వారి విధానాలు మార్చుకోవాలని అన్నారు. మహిళా కార్మికులని చూడకుండా ఎక్కడపడితే అక్కడ చితకబాదడం సిగ్గుచేటని అన్నారు.అనేకమంది కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలకు ఈ దాడిలో తలలు పగిలి,చేతులు విరిగాయని అన్నారు.పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సి.ఐ.ఎస్.ఎఫ్.వారు వినిపించుకోకుండా కార్మికులను వేటాడి,వేటాడి లాఠీలు విరిగేల కొట్టడడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్మికులపై సి.ఐ.ఎస్.ఎఫ్.వారితో ఎందుకు లాఠీచార్జి చేయించిందో యాజమాన్యం సమాధానం చెప్పాలి. సంఘటనకు కారణమైన వారిని గుర్తించి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.గాయపడిన కార్మికులందరికి యాజమాన్యం మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని,వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube