కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

1
TMedia (Telugu News) :

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

టీ మీడియా, డిసెంబర్ 5, వనపర్తి బ్యూరో : రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా అధ్యక్షులు పిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్ పాల్గొనడం జరిగింది. మాజీ మంత్రి డాక్టర్ జల్లెల చిన్నారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్రంలో రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ అమలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతుల సమస్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, శ్రీరంగపురం జడ్పిటిసి సభ్యులు ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, వనపర్తి పట్టణ అధ్యక్షులు డి కిరణ్ కుమార్,

Also Read : సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం

మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, మత్స్యకార జిల్లా అధ్యక్షులు యాదయ్య మైనార్టీ జిల్లా అధ్యక్షులు కమ్మర్ మియా, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సహదేవ యాదవ్, ఎస్ టి సెల్ జిల్లా అధ్యక్షులు వాల్య నాయక్, కౌన్సిలర్ బ్రహ్మం, ఉమ్మల రాములు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా, భాస్కర్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube