అటవీ అధికారులు, సిబ్బందికి భరోసా కల్పించండి
– పోలీసుకు డీజీపీ ఆదేశం
టీ మీడియా, నవంబర్ 25, హైదరాబాద్: అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. అటవీశాఖ, క్షేత్ర స్థాయి సిబ్బంది సమస్యలపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్‌తో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో స్వయంగా సమావేశం కావాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు సూచించారు.
Also Read : శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శన వేళల్లో మార్పులు
వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కూడా తమ పరిధిలోని అటవీ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించారు.