బాధితులకు నష్ట పరిహారం అందించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 4 వనపర్తి : వనపర్తి పట్టణంలోని హరిజనవాడ పాతకోట మధ్యలో ఉన్న కందకంలో నిర్మిస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం పనులను శనివారం రోజు టిడిపి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షులు నందిమల్ల అశోక్ మాట్లాడుతూ కందకంలో మార్కెట్ యార్డ్ నిర్మాణం కొరకు ఇండ్లు కోల్పోయిన దళిత బడుగు బలహీన వర్గాల బాధితులకు నష్టపరిహారం డబల్ బెడ్రూమ్లు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తాము పూర్తిగా సహకరిస్తామని అదే సమయంలో అభివృద్ధి పేరిట పేద ప్రజలను నష్టపరుస్తాము అంటే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాత ముత్తాతల నుండి రాజా రామేశ్వరరావు సహకారంతో నివాసాలు ఏర్పాటు చేసుకొని దళితులు ఇతర వర్గాలు జీవిస్తూ ఉన్నాయి. వారికి ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు. ఈ పేద వర్గాలు మార్కెట్ నిర్మాణం చేపట్టడం వల్ల వాళ్లు వారి స్థలాలు నివాస నిర్మాణాలు కోల్పోవడం జరిగింది.

ఆగమేఘాలమీద మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను శంకుస్థాపన పెట్టుకొని పోలీసు బందోబస్తుతో నిర్మాణాలు తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మున్సిపల్ పాలకవర్గం డబల్ బెడ్రూమ్ లు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ బాధితుల లిస్ట్ కూడా సేకరించకపోవడం బట్టి చూస్తే వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే బాధితులకు నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని పూర్తిగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని యువతకు మార్కెట్ షాపులు కేటాయించి జీవన ఉపాధి కల్పించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.

లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉండి రాజకీయ పార్టీల ప్రజా సంఘాలను కలుపుకొని బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదే విధంగా పేద ప్రజలను ఆదుకోవడంలో అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అని ఆరోపించారు. ఇవాళ కేవలం వ్యక్తి భజన చేసే ఒక యార్డ్ సంస్థకు 1000 గజాల స్థలం కేటాయించారు.

లింగారెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ నందు వారి అనుచరులకు షాపులు కేటాయించడం డి.టి.సి.పి లేఅవట్ లో ఉన్న పార్కింగ్ స్థలాలు అమ్ముకోవడం లక్షల రూపాయలు స్వీపింగ్ మిషన్ పేరిట దుర్వినియోగం జిరాక్స్ పేరిట వేలాది రూపాయలు దుర్వినియోగం చేయడం సొంత ప్రయోజనాల మీదే పెట్టే శ్రద్ధ పేద ప్రజలకు ఇచ్చి హామీలపై పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదలకు చిట్యాల శివారులో డబల్ బెడ్రూమ్లు కూడా వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మార్కెట్ రోడ్డు విస్తరణలో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దస్తగిరి, డి. బాలరాజు, ఏం.బాలు నాయుడు. బాధితులు విజయ్ బాబు ,గంధం రవికుమార్, గంధం రాజు, శ్రీనివాసులు, డి. గట్టయ్య, డి భాగ్యమ్మ, తలారి మరియమ్మ, గోవిందు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube