నిత్యవసర సరుకులు అందించిన సోనుసూద్ వీరఅభిమాని

నిత్యవసర సరుకులు అందించిన సోనుసూద్ వీరఅభిమాని

1
TMedia (Telugu News) :

నిత్యవసర సరుకులు అందించిన సోనుసూద్ వీరఅభిమాని

టీ మీడియా, నవంబర్ 15, బోనకల్ : బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో సోనుసూద్ విగ్రహం నిర్వహించి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక బోనకల్లు శాంతి నిలయంలో నిత్యవసర సరుకులు కూరగాయలు సోనుసూద్ వీరాభిమాని గుర్రం వెంకటేశ్వర్లు ఫ్యామిలీ తో కలిసి వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్ చేతుల మీదుగా శాంతి నిలయంలో పిల్లలు,సిస్టర్స్ మధ్య నిత్యవసర సరుకులు కూరగాయలు అందించడం జరిగింది.సోనూసూద్ వీర అభిమాని గుర్రం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ఆయన అభిమానిగా నా వంతు బాధ్యతగా కూలి పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో విజయవాడలో సోను సూద్ విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహాన్ని మా గ్రామమైన గార్లపాడు గ్రామంలో ప్రతిష్టించడం జరిగింది.

Also Read : 19న ఘంటసాల శతజయంతి

సోనుసూద్ విగ్రహం నిర్మించి సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. సోనుసూద్ కి అభిమానంతో విగ్రహం నిర్మించిన గుర్రం వెంకటేశ్వర్లును డాక్టర్ కోట రాంబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో సోనుసూద్ వీర అభిమాని గుర్రం వెంకటేశ్వర్లు,మరియమ్మ, వేణు, విష్ణు, వైస్ ఎంపీపీ గూగుల్ రమేష్,రాంపురం గార్లపాడు ఎంపీటీసీ మొక్కపాటి అప్పారావు,తాత లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube