132 కె.వి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరసన

132 కె.వి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరసన

1
TMedia (Telugu News) :

132 కె.వి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరసన

టీ మీడియా, అక్టోబర్ 27, జన్నారం : మండల కేంద్రంలో 132 కె.వి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజేశ్వర్ ఆధ్వర్యంలో గురువారం రోజున ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరం ఎదుట నిరసన తెలిపి అనంతరం ఎంపీడీవో అరుణారాని,ఎంపిపి మాదాడి సరోజన లకు వినతి పత్రం అందజేశారు.

Also Read : కబ్జాదారులపై చర్యలు తీసుకోకుండా రైతులపై కేసుల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, అంతేకాకుండా లో వోల్టేజ్ సమస్యతో రైతులు మోటార్లు నడవక పంటలు పాడైపోతున్నాయని కావున మండల కేంద్రంలో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేలా పై అధికారులకు తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పులిశెట్టి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఉప్పుల విజయ్ లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube