నిత్యావసర సరుకుల పంపిణీ

నిత్యావసర సరుకుల పంపిణీ

1
TMedia (Telugu News) :

నిత్యావసర సరుకుల పంపిణీ

టి మీడియా, మే 11, లక్షెట్టిపేట:

వాసవి మాత జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణానికి 30 మంది చిరుద్యోగులకు హనుమాన్ టెంపుల్ ఫంక్షన్ హాల్ లో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య చేతుల మీదుగా రూ.లక్ష 20 వేల విలువైన సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కాంతయ్య మాట్లాడుతూపట్టణానికి చెందిన ప్రవాస భారతీయుడు కాసం గణేష్ గుప్తా తన మిత్ర బృందంతో ఏర్పాటుచేసిన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కాసం గణేష్, కుటుంబానికి వాసవి మాత ఆశీస్సులు ఉండాలన్నారు. ప్రతి ప్రవాస భారతీయుడు తమ స్వగ్రామం పైన ప్రేమాభిమానాలతో సేవా కార్యక్రమాలు చేస్తే మాతృభూమి రుణం తీర్చుకున్న వాళ్ళమవుతామని వివరించారు.

 

 

Also Read : విశ్వకర్మ ఆరాధన ఉత్సవాలు

 

అంతేకాకుండా కరోన విజృంభించినప్పుడు గ్రేటర్ అట్లాంటా ఆధ్వర్యంలో లక్షెట్టిపెట్ లో ఎంతో మందికి నిత్యావసర సరుకులు, ఇతర సేవలు అందించిన ఘనత కాసం గణేష్ గుప్తా మిత్ర బృందానికి దక్కిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు కొత్త వెంకటేశ్వర్లు, పట్టణ సంఘం అధ్యక్షులు చెట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి నాలమాస్ శ్రీనివాస్, యూత్ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం వికాస్, చింతల రంజిత్, జిల్లా అవొప అధ్యక్షులు గుండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రాచర్ల సత్యనారాయణ, కోశాధికారి రవిందర్, కౌన్సిలర్ సాయిని సుధాకర్, పాతిబండ్ల శ్రీరామూర్తి, పల్లెర్ల మనోహర్, నరేందుల రమేష్, వొజ్జల శ్రీనివాస్, సామ అంజన్ కుమార్, గుండ కృష్ణ మోహన్, జిల్లా సత్థయ్య, నరేందుల భీమన్న, కొంజర్ల శ్రీనివాస్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube