రైతులను వెంటనే ఆదుకోవాలి మాజీ ఎమ్మెల్యే విజయరమన రావు
టీ మీడియా పెద్దపల్లి బ్యూరో జనవరి 15
ఈ రోజు కాల్వశ్రీరాంపుర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు మాట్లాడుతూ
పత్రికల్లో మరియు సోషల్ మీడియాలో ఫోజులివ్వడానికి తప్ప పెద్దపల్లి నియోజకవర్గంలో గత ఏడు సంవత్సరాలలో పేద ప్రజలకు చేసింది ఏమి లేదని వారు అవేదన వ్యక్తం చేశారు దాసరి గెలిచిన నుండి రైతులకు
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇప్పించిన దాఖలాలు లేవు మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు…. మండలంలోని పెగడపల్లి, మంగపేట,గంగారం,కాల్వశ్రీరాంపూర్ గ్రామాల్లో నిన్న కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న మరియు ఇతర పంటలను పరిశీలించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారు.ఈ సంధర్భంగా విజయరమణారావు గారు మట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా నేను రైతుల వద్దకు వెళ్లి దెబ్బతిన్న పంటలనూ పరిశీలించాక పత్రికల్లో ఫోజులివ్వడానికి రైతుల వద్దకు వెళ్తున్న స్థానిక ఎమ్మెల్లేకు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటె పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలనూ వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోని పత్రికల్లో ఫోజులివ్వాలని స్థానిక ఎమ్మెల్లేను మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు గారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపాగాని సారయ్య గౌడ్,పెగడపల్లి సర్పంచ్ అరెల్లి రమేష్,గజనవేన సదయ్య, కాల్వ వేమరెడ్డి,నక్కల కొమురయ్య, మియపురం సతీష్, గోపగోని శ్రీకాంత్, మెడి అశోక్, జంగా సమిరెడ్డి,పోలీసాని సునీల్ రావు,ఉజ్జ రాజేశం,దొబిళ్ళ సంపత్, తదితరులు పాల్గొన్నారు.
