ఐఓఏ తొలి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉష రికార్డు

ఐఓఏ తొలి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉష రికార్డు

1
TMedia (Telugu News) :

ఐఓఏ తొలి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉష రికార్డు

టీ మీడియా, డిసెంబర్ 10, న్యూఢిల్లీ :  భారతదేశపు దిగ్గజ అథ్లెట్‌, పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్తింపు పొందారు. అంతేకాకుండా మహారాజా యాదవీంద్ర సింగ్ (1934, క్రికెట్‌) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి స్పోర్ట్స్‌ పర్సన్‌గా కూడా ఆమె ఘనత దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఉషకు పోటీగా వేరెవరూ నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

Also Read : టిప్పర్ కింద పడి వ్యక్తి మృతి

ప్రస్తుతం అథ్లెటిక్స్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా జూనియర్‌‌ సెలెక్షన్‌‌ కమిటీకి పీటీ ఉష ఛైర్‌‌ పర్సన్‌‌గా ఉన్నారు. కాగా, 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతులో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన ఉష.. 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండేసి పసిడి పతకాలతో ఉష మెరిసింది. ఒక్క ఆసియా క్రీడల్లోనే ఆమె 14 స్వర్ణాలతోపాటు 23 పతకాలు గెలుచుకుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube