ప్రజాపాలన సభలు పగడ్బంధీగా నిర్వహించాలి..

- దరఖాస్తులను పారదర్శకంగా చేప్పట్టాలి

0
TMedia (Telugu News) :

ప్రజాపాలన సభలు పగడ్బంధీగా నిర్వహించాలి..
– దరఖాస్తులను పారదర్శకంగా చేప్పట్టాలి
– ప్రజలకు చేరువగా ప్రజాపాలన అందించాలి

టి మీడియా, డిసెంబర్ 27,పెద్దవూర : మండలం లోని ప్రతి గ్రామ పంచాయితీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన సభలను పకడ్బందీగా నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని మండల ప్రత్యేకఅధికారి శ్రీనివాస రావు అన్నారు.బుధవారం మండల కేంద్రం లోని ఎంపీడిఓ కార్యాలయం లో మండల స్తాయి అధిరులతో ప్రజాపాలన సభల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, నేటినుంచి జనవరి 6 వరకు పనిదినాల్లో మండలం లోని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతివార్డుల్లో సభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.

Also Read : తెలంగాణలో చలి తీవ్రత అధికం

ప్రజాపాలన గ్రామసభ నిర్వహణ సమయం లో ప్రతి దరఖాస్తుదారుడికి 4 నుంచి 5నిమిషాలు కేటాయించాలన్నారు. దరఖాస్తుదారుడికి రూపాయి ఖర్చు కాకుండా చూడాలని, జిరాక్స్‌ వారు కూడా ఎక్కువ మొత్తం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్ ఇళ్లు మొదలైన పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.ప్రతి గ్రామానికి ఒకరోజు ముందుగానే అప్లికేషన్లు వస్తాయని,గ్రామ ప్రజలకు ముందుగానే దరఖాస్తులు అందించాలని, వాటిని ముందుగానే నింపి గ్రామసభకు వచ్చేలా చూడాలని సూచించారు. అలాగే నిరక్షరాస్యులకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు నింపడంలో సహకరించేలా చూడాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన సభలు ఎప్పుడు నిర్వహిస్తున్నామనేది ప్రజలకు తెలియజేయాలని సూచించారు.అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేయాలని ప్రజాపాలన గ్రామసభల సమయంలో గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు.

Also Read : హామీలు అమలు చేయాలన్నదే లక్ష్యం

ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. ప్రజాపాలన విజయవంతంగా అమలు చేసందుకు ప్రభుత్వానికి ప్రజలక ఉద్యోగులు వారధులుగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎంపీడిఓ విజయకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమమావేశం లో అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు పాల్గొన్నారు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube