మధిర మండలంలో ప్రారంభమైన ప్రజా పాలన

దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం

0
TMedia (Telugu News) :

మధిర మండలంలో ప్రారంభమైన ప్రజా పాలన

దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం

టీ మీడియా, డిసెంబర్ 28, మధిర : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైనది. మధిర మండలం సైదల్లిపురం గ్రామంలో మధిర మండల తహసిల్దార్ వెంకటేశ్వర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా సూరంశెట్టి కిషోర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆరు గ్యారెంటీ పథకాల అమలు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నుండి జరుగు గ్రామ సభలలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులకు అందే విధంగా చూడగలరని నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా మీరే దగ్గరుండి వారి దరఖాస్తులను ప్రజా పాలన గ్రామ సభలొ అధికారులకు అందజేయండి. 28 తేదీ నుండి 6 తేదీ వరకు మీమీ గ్రామాలలో గ్రామంలోని కుటుంబాల సంఖ్యను బట్టి ఒకటి రెండు డెస్కులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక అధికారి అక్కడే ఉండి దరఖాస్తులను స్వీకరిస్తారు,

Also Read : సైబా అవార్డు 2023 లో పాల్గొన్న సర్పంచ్ లావణ్య

మీకు షెడ్యూల్ వచ్చిన విధంగా మీ గ్రామాలలో గ్రామసభలు నిర్వహించబడతాయి. ఆ గ్రామసభ నిర్వహణ సమయంలో మన కాంగ్రెస్ పార్టీనాయకులు కార్యకర్తలు అందరూ అక్కడే ఉండి అధికారులకు సహాయ సహకారాలు అందించగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ రఫీక్ సైదల్లిపురం గ్రామ సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు అర్.ఐ లు జయకృష్ణ, రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల బీసీ సెల్ అధ్యక్షుడు *చిలువేరు బుచ్చి రామయ్య, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube