మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సహకారంతో మరుగుదొడ్ల మరమ్మతులు

మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సహకారంతో మరుగుదొడ్ల మరమ్మతులు

1
TMedia (Telugu News) :

మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సహకారంతో మరుగుదొడ్ల మరమ్మతులు

టీ మీడియా, మే 23, మహానంది:

మహానంది మిడ్ టౌన్ రోటరీ క్లబ్ వారి సహకారంతో మహానంది క్షేత్రం లో మరుగుదొడ్లు మరియు స్నానపు గదులు మరమ్మతులు చేపట్టినట్లు ఆలయ ఈవో కాపుచంద్రశేఖరరెడ్డి ఆదివారం పేర్కొన్నారు.మరుగుదొడ్లు స్నానపు గదులు పాడై పోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని క్లబ్ వారికి తెలియజేయడంతో ఆర్థిక సహాయ సహకారాలు అందించినట్టు తెలిపారు.

Also Read : మిర్చి నర్సరీలను తనిఖీ చేసిన ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు

సభ్యులు జి చిన్నపరెడ్డి 50000 వేలు బి మురళీకృష్ణ 50000 వేలు ,శ్రీ గాంధీ 20000 వేలు ,కాలువ నాగరాజు 10000 వేలు ,ఆదినారాయణ 5000 వేలువిజయలక్ష్మి ఐరన్ మార్ట్ నంద్యాల సిమెంట్ బస్తాలను ,శ్రీనివాస రెడ్డి హిందుస్థాన్ టైల్స్ నంద్యాలవారు టైల్స్ ను అందజేసినట్టు తెలిపారు .దాతలు భక్తులు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆర్థిక సహాయ సహకారాలు అందజేయాలని ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.భక్తులకు మరిన్ని మరుగుదొడ్లు స్నానపు గదులు అవసరమని వాటి నిర్మించడానికి దాతలు ముందుకు రావాలని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube