బీజేపీ ఆధ్వర్యంలో పంప్ హౌస్ ముట్టడి

బీజేపీ ఆధ్వర్యంలో పంప్ హౌస్ ముట్టడి

1
TMedia (Telugu News) :

బీజేపీ ఆధ్వర్యంలో పంప్ హౌస్ ముట్టడి

టీ మీడియా. జులై27 ,మహాదేవపూర్:

మంథని నియోజకవర్గ ఇంచార్జి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు నాయకులు మాట్లాడుతూ..

రేపు తేదీ: 28 తారీకు గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో *ఛలో కన్నెపల్లి. కి పిలుపు నివ్వడం జరిగింది.
వేలాది కోట్లు ఖర్చు పెట్టి బాహుబలి మోటార్లు పెట్టి నీటిని ఎత్తు పోస్తునాం అని గొప్ప లు చెప్పిన తెరాస ప్రభుత్వం ఇప్పుడు నీటమునిగిన మోటార్లు కి ఎవరు బాధ్యత వహిస్తారు..
ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు, కెసిఆర్ అత్యంత ప్రతిష్టత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు డోల్లా తనం ఇపుడు బయట పడింది.

 

Also Read : స్వామివారిని దర్శించుకున్న జెడ్పీ ఛైర్ పర్సన్

ప్రాజెక్టు ను మేము కట్టినాము ఎవరు, ఎక్కడ ఇలాంటి ప్రాజెక్టు కనీవీని ఎరగని రీతిలో నిర్మించలేదని చెప్పి బస్ లు పెట్టి మరి జనాలకి చూపించారు కదా..?
మీరు ఇప్పుడు ఎందుకు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ లోనికి అనుమతులు లేవని చెపుతున్నారు..
వేల కోట్ల రూపాయలు వరద,బురదపాలు చేశారు..!
దీనికి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు…!
ప్రాజెక్టు వల్ల ఎప్పటికి వరకు మంథని నియోజకవర్గ ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించరో చెప్పాలి..!ప్రతిపక్ష పార్టీ లకు ప్రాజెక్టు లను చూసే అర్హత లేదా..?
మేము చూసి చెప్పుతాం కదా గొప్ప ప్రాజెక్టు అయితే.
ప్రాజెక్టు లో ఏమి జరుగుతుందో ప్రజలందరికీ తెలియాలి..!
మేము పెద్ద ఎత్తున కన్నె పల్లి పంప్ హౌస్ ని చుడానికి కచ్చితంగా వెళ్లుతాం…!
ప్రతి గ్రామం నుండి ప్రజలు రావాలి..
వరద వల్ల బురద, మట్టి వల్ల మోటార్లు పూర్తిగా నిండి పోయాయి..
వరద వల్ల ప్రతి ఏడాది మా ప్రాంతంలోని రైతు లు నష్టపోతున్నారే తప్ప మంథని నియోజకవర్గ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు వల్ల ఎటువంటి లాభం లేదు…
మేడిగడ్డ, సుందిళ్ల, కన్నెపల్లి లో ఎం జరుగుతుందో ప్రజానీకానీకి తెలియాలి..
బహుబలి మోటార్ల బాగోతం బట్టబయలు చేయాలి..!
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రతి సంవత్సరం వేల ఎకరాలు నష్ట పోతున్నాము..
ఊరురా బస్సు లు పెట్టి వేలాది మందిని తీసుకొని పోయారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆణువణునా పోలీస్ బలగాలతో అడ్డుకుంటున్నారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ, మండలము ప్రధాన కార్యదర్శి బొల్లం కిషన్,బీజేవైఎమ్ జిల్లా కార్యదర్శి గోర శ్రీకాంత్, కాళేశ్వరం ఎస్సిసెల్ అధ్యక్షుడు లేతకరి చరణ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube