మాజీ అధ్యక్షుడి ముఖంపై పంచ్
టీ మీడియా, డిసెంబరు 7, టిరానా : అల్బేనియా మాజీ అధ్యక్షుడు సాలి బెరిషాకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని టిరానాలో బుధవారం జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దేశంలో ముందస్తు ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో ప్రతిపక్ష నాయకులతో కలిసి బెరిషా పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఎర్ర చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని ఒక్కసారిగా బెరిసా వద్దకు వచ్చి ఆయన ముఖంపై చేత్తో బలంగా గుద్దాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Also Read : నిరసనలకు తలొగ్గిన చైనా.. కోవిడ్ నిబంధనల్లో సడలింపు
నిందితుడు గతంలో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాడని.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. తనపై పీఎం రామ దాడి చేయించాడని.. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని సాలి బెరిషా ఆరోపించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube