కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 8 వనపర్తి : వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టిపిసిసి కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు రేయింబవళ్లు కష్టపడి పంటను పండించి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ప్రభుత్వం సాకులు చెబుతూ వరి ధాన్యాని కొనకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు కట్టిపెట్టి రైతుల ధాన్యాన్ని కొనుగోలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో అధిక వర్షాలు కురవడం తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా దళారులు క్వింటాలు ధర 1100 నుంచి 1200 అడుగుతున్నారు. నిత్యావసర సరుకులను కూడా కొనలేక సామానులు పస్తులు గడుపుతుంటే దళారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతారు అన్నారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కొనుగోలు కేంద్రాల వద్ద దాన్యం అమ్ముకోవడానికి వేచి చూస్తూ చలికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు రైతు కూలీలకు దుప్పట్లు పంపిణీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇంతకుముందు మండల కిసాన్ అధ్యక్షులుగా అభిమానురెడ్డి గౌరవ అధ్యక్షులుగా నాగన్న, సెక్రెటరీగా మన్యం, ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డే కృష్ణ ,జగదీష్ ,కృష్ణవర్ధన్రెడ్డి, వేమన్న ,మహేష్ రెడ్డి, బాలస్వామి, శ్రీనివాస్ రెడ్డి, సాయిబాబా, తిరుపతి రెడ్డి ,వెంకటస్వామి, జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్, నరేందర్, వెంకటస్వామి ,శ్రీను మరియు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

A protest was organized at the agricultural market in Madanapuram.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube