పుతిన్‌ని ఆయన సన్నిహితులే హతమారుస్తారు : జెలెన్‌స్కీ

పుతిన్‌ని ఆయన సన్నిహితులే హతమారుస్తారు : జెలెన్‌స్కీ

0
TMedia (Telugu News) :

పుతిన్‌ని ఆయన సన్నిహితులే హతమారుస్తారు : జెలెన్‌స్కీ

టీ మీడియా, ఫిబ్రవరి 27, రష్యా : రష్యా – ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం నేటికీ చల్లారట్లేదు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా ‘ఇయర్‌’ పేరిట ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదొమిర్‌ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూస్‌వీక్‌ ఓ కథనం వెలువరించింది. డాక్యుమెంటరీలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ‘పుతిన్ పాలన ఎప్పుడో ఒకప్పుడు అంతం కాక తప్పదు. అతని నాయకత్వం బలహీనపడే సమయం ఆసన్నమైంది. పుతిన్‌ను ఆయన సన్నిహితులే వ్యతిరేకిస్తారు. వారు ఏదో ఒక కారణం చూపించి పుతిన్‌ను హతమారుస్తారు. ఆ రోజు నేను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందా అని నన్ను అడిగితే అవును అనే సమాధానమిస్తా. కానీ, ఎప్పుడు..? అంటే మాత్రం నేను చెప్పలేను’ అని జెలెన్‌స్కీ అన్నారు.

Also Read : సర్జరీ సమయంలో వైద్యులు పచ్చ బట్టలు మాత్రమే ఎందుకు వేసుకుంటారు.?

పుతిన్‌పై అతని సన్నిహితులే అసహనంతో ఉన్నారని ఇటీవలే ది వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో అభిప్రాయపడింది. అంతేకాకుండా రష్యా ప్రజలు, పలువురు నేతలు, పుతిన్‌ సన్నిహితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నట్లు రష్యా నుంచి పలు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube