పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అమోఘం

జెడ్పీ చైర్మన్ ఇన్చార్జ్ పుట్ట మధు

1
TMedia (Telugu News) :

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అమోఘం

-జెడ్పీ చైర్మన్ ఇన్చార్జ్ పుట్ట మధు

టీ మీడియా, సెప్టెంబర్ 28 ,మంథని : నియోజకవర్గ పేద ప్రజలకు సేవ చేయడానికి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్ట మధు ఆదేశాల మేరకు పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు అమోఘమని టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు జెక్కు రాకేష్ అన్నారు. అనేక ఏండ్లుగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశాం.. భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని జక్కు రాకేశ్ అన్నారు. బుధవారం జక్కు రాకేష్ పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు.

Also Read : మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ.

 

ఈ సందర్భంగా యువజన నాయకులు జక్కు రాకేశ్ మాట్లాడుతూ.. యువతను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకే క్రికెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. యువతలోని సామర్థ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించి భావిభారత పౌరులుగా తీర్చి దిద్దడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే శక్తి క్రీడలకు ఉంటుందని జక్కు రాకేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి, తెరాస మండల ఉపాధ్యక్షులు ఎడ్ల సమ్మయ్య, తెరాస నాయకులు కోట రవి, వాల యాదగిరి రావు, ఎం.డీ తాజొద్దీన్, బాద్రాపు సమ్మయ్య, కో ఆప్షన్ అయూబ్ ఖాన్, గ్రామశాఖ అధ్యక్షుడు వేల్పుల లచయ్య, పులి రామన్న, పంథకని వెంకట్ రాజం, యువ నాయకులు కుంభం సురేశ్ రెడ్డి, తెరాస యూత్ వైస్ ప్రెసిడెంట్స్ ఎడ్ల అరుణ్, నీలకంటి శ్రీకాంత్, యూత్ నాయకులు జక్కు రమేష్, ఉప సర్పంచ్ తోట రాజేశ్వర్ రావు, యూత్ లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube