కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

రూ.64లక్షలు చెక్కులు పంపిణి

1
TMedia (Telugu News) :

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

–రూ.64లక్షలు చెక్కులు పంపిణి

-లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం

టీ మీడియా, అక్టోబర్ 18,ఖమ్మం : పేదల శ్రేయస్సు కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. ఖమ్మం విడిఓ కాలనీలోని మంత్రి క్యాంపుకార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడిబిడ్డల పెళ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్‌ గారు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారం తగ్గిందన్నారు.సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.సోమవారం 64 చెక్కులకు గాను రూ.64లక్షల విలువైన చెక్కులు పంపిణి చేశామని, నేటి వరకు కల్యాణలక్ష్మీ, షాదిముభారక్ పథకం ద్వారా 7515 చెక్కులకు గాను రూ.70.21 కోట్లు పంపిణీ చేయడం గర్వంగా ఉందన్నారు.

Also Read : పాలిటెక్నిక్ కళాశాలకు పూర్వ విభాగం తేవాలి

ఒక్క ఖమ్మం నియోజకవర్గం కే 70 కోట్లు ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు.గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా కులమతాలకు అతీతంగా కేవలం సామాన్యులే కొలమానంగా తీసుకుని అన్ని వర్గాల వారు తమ ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అప్పులు చేయకుండా ఉండేందుకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి వారి ఇళ్లలో వెలుగులు నింపుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.రైతులకు 24 గంటల పాటు కరెంటు, తాగునీరు, పేద ఆడపడుచుల కాన్పుల కోసం కేసీఆర్ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ. 13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ. 12 వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.కార్పోరేట్ పాఠశాలల్లో చేరి చదువుకోలేని వారికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత ఆంగ్ల విద్యను అందిస్తుందని అన్నారు. ఆడబిడ్డలు కంటతడి పెట్టకుండా ఎప్పుడూ నవ్వుతూ జీవించేలా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.అనంతరం ఆయా లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, తహసీల్దార్‌ శైలజ, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube