పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

1
TMedia (Telugu News) :

పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

టీ మీడియా,సెప్టెంబర్29, ఖమ్మం : సాంకేతికతను, సౌకర్యాన్ని జోడించి పునరుద్ధరించబడిన పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.పోలీస్ కమిషనర్ పాత క్యాంపు కార్యాలయం అవరణలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ఇటీవల శిధిలావస్థలో చేరడంతో మంత్రి , జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరవ తీసుకొని పునరుద్ధరణ పనులు చేపట్టి పూర్తి చేసిన కాన్ఫరెన్స్ హాల్ ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు, డి.సి.సి.బి. చైర్మన్ కూరాకుల నాగభూషణం , సుడా చైర్మన్ విజయ్ గారు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ , పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తో కలసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

Also Read : బహుజనుల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక పోలీస్‌శాఖకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి శాశ్వత ప్రాతిపదికన భవనాల నిర్మిస్తున్నదని అన్నారు.నూతన పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ శాఖ అంతర్గత ‍సమావేశాలు, శాంతిభద్రతలు,నేర సమీక్ష సమావేశాలు, ఫంక్షనల్ వర్టికల్స్ శిక్షణ తరగతులు, వివిధ సంఘాలు, పోలీసు అధికారులతో సమావేశాలు, ఐటి, సైబర్ సెల్ ,క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ సమావేశాలు అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఆడ్మీన్) శభరిష్ , అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , అడిషనల్ డీసీపీ కుమారస్వామి , ఏసీపీలు రామోజీ రమేష్ , అంజనేయులు , భస్వారెడ్డి గారు, వెంకటేష్ గారు, రహెమాన్ గారు, ప్రసన్న కుమార్ , రవి , వెంకటస్వామి గారు, సిఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube