కేసీఆర్ కు కృతజ్ఞతలు

-పోలవరం ప్రాజెక్టు నీళ్లు వదలడం లోనిర్లక్ష్యం వల్లే వరద

1
TMedia (Telugu News) :

 

కేసీఆర్ కు కృతజ్ఞతలు

-పోలవరం ప్రాజెక్టు నీళ్లు వదలడం లోనిర్లక్ష్యం వల్లే వరద

-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
టీ మీడియా, జులై19,హైదరాబాద్ : భద్రాచలం కు ఇరు వైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు ,ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన చర్యలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో – ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా సమావేశంమంత్రి మీడియాతో మాట్లాడారు. వెయ్యి కోట్ల రూపాయల తో శాశ్వతప్రాతిపదికనచర్యలుచేపట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడం లో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుతగ్గించాలనిమొదటినుంచి డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. భద్రాచలం వద్ద కరకట్టలు గతంలో కట్టినా అవి పటిష్టంగా లేవని సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం కోసం నిపుణుల కమిటీ ప్రకటించారని పేర్కొన్నారు.ముంపునకు గురయ్యే కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం దిశగా సీఎం చర్యలు చేపట్టారని వరదలోనూ సీఎం కేసీఆర్ పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు.

Also Read : 48 గంటల్లోనే కాఫర్ డ్యాం ఎత్తు పెంపు

వరదలతోగ్రామాల్లోదెబ్బతిన్నవిద్యుత్వ్యవస్థనుదాదాపుగాపునరుద్ధరించుకోగలిగామని మంత్రి వెల్లడించారు.పారిశుధ్య పరిస్థితిని మెరుగు పరిచేందుకు వివిధ జిల్లాల నుంచి దాదాపు నాలుగు వేల మంది సిబ్బందిని రప్పించామని, తాగు నీటి సరఫరా ను పునరుద్ధరించామని వివరించారు.ఇంత స్థాయి వరదల్లోనూ ఒక్క ప్రాణం పోకుండా చర్యలు తీసుకున్నామని వరదలపరిస్థితినిసీఎంకేసిఆర్ముందేఊహించినెల13నుంచేమమ్మల్నిఅక్కడఉండాలనిఆదేశించారన్నారు.ప్రతీ గంట కు సీఎం కేసీఆర్ మాకు నిరంతరంగా ఆదేశాలిచ్చారని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 25 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం ఇదే మొదటి సారన్నారు.ఇన్ని ఏర్పాట్లు చేసినా మీడియా లో సౌకర్యాల లేమి అంటూ వార్తలు రావడం దురదృష్టకరమని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా అంటు వ్యాధులు ప్రబలకుండా మంత్రి హరీష్ రావు నిరంతరం వైద్య శాఖ సిబ్బంది కి ఆదేశాలిస్తున్నారనిపోలవరం కోసం ఏడు మండలాలు ఆంధ్రా లో కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆది లోనే మేము నిరసన తెలిపామని గుర్తు చేశారు.కనీసం ఐదు గ్రామలనైనా తిరిగి తెలంగాణ లో కలపాలని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.

 

Also Read : లోక్‌స‌భ‌లో ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న

గిరిజనులను, గిరిజనేతరులను వరదల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన వరద సాయం బాధితుల అకౌంట్ల లో జమ అవుతుందన్నారు.బియ్యం, పప్పు ఇప్పటికే భాదితులకు అంద జేశామని పోలవరం జాతీయ ప్రాజెక్టు అని వరదల నివారణకు ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని ఎత్తు తగ్గించాల్సిన భాద్యత కేంద్రం మీద ఉందన్నారు. బీజేపీ నేతలు కేంద్రం నుంచి సాయం తేకుండా వట్టి మాటలు మాట్లాడుతున్నారని గుజరాత్ కు వరద సాయం చేసిన కేంద్రం తెలంగాణ కు ఇప్పటి వరకు సాయం ప్రకటించలేదని ఆరోపించారు. హైద్రాబాద్ వరదలు వచ్చినపుడు బీజేపీ పట్టించుకోలేదు.. ఇపుడు పట్టించుకోవడంలేదని విమర్శించారు.ప్రజలను ఓదార్చేందుకు ఒక్క కాంగ్రెస్, బీజేపీ నేత కనిపించలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ పార్టీ వ్యవహారాల్లో బిజీ గా ఉన్నారని ప్రజలంటే వారికి పట్టింపు లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు తో భద్రాచలం కు ఉన్న ముప్పును నివారించాలన్నారుఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి మా పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని ఐదు గ్రామాల్లోని ప్రజలు తమను తెలంగాణ లో కలపాలని కోరుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube