చర్చ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

చర్చ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

1
TMedia (Telugu News) :

చర్చ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

టీ మీడియా, జులై21, ఖమ్మం నగరం 28వ డివిజన్ ప్రకాష్ నగర్ నందు నూతనంగా నిర్మించిన సీయోను శిఖరాగ్ర ప్రార్థన సహవాసము చర్చ్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రపంచ దేశాలకు చెందిన దేవుడు యేసు ప్రభువు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేవుని సందేశం మనకు ఎల్లప్పుడూ మంచిని బోధించడానికే క్రీస్తు వాక్యం ఉందని, మనిషి సన్మార్గంలో నడిచే విధంగా బైబిల్ బోదిస్తుందన్నరుఇక్కడ చర్చ్ నిర్మించడం మనందరికీ ఆశీర్వాదకరమని అన్నారు.

 

Also Read : ధర్నా నిర్వహించిన సిపిఐ, ఏఐటియుసి శ్రేణులు

అన్ని మతాలను గౌరవించి ఎవరి దేవుడిని వారు స్వేచ్చగా, భక్తి శ్రద్ధలతో ఆరాధించే వాతావరణం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ కల్పించారని అన్నారు.కార్యక్రమంలో పాస్టర్ జాన్ బాబు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా గారు, సుడా చైర్మన్ విజయ్ గారు, కార్పొరేటర్ గజ్జల లక్ష్మీ, నాయకులు దడాల రఘు, కొప్పెర నర్సింహరావు తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube