విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
టీ మీడియా, ఫిబ్రవరి 27, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని బండారునగర్ లో ఉన్న ప్రైమరీ హైస్కూల్లో విద్యార్థులకు అందించే భోజనాలను సోమవారం బీఆర్ఎస్ యువజన నాయకుడు వజ్రాల రమేష్ పరిశీలించారు. పిల్లలను అందర్నీ భోజనం బాగుందా లేదా అని అడిగి పిల్లలతో పాటు భోజనం చేసిన వజ్రాల రమేష్ ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కూరగాయలు మంచిగా చేయాలని పాఠశాల ప్రధానోఉపాధ్యాయులు శివకుమార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉందేకోటి అంజి, జాంగిర్, లియాకత్ మహేష్, డేగగౌడ్ నాయక్,రాజు,అశోక్, కృష్ణ, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.