నాణ్యత నగుబాటు

సిమెంట్ తక్కువ.. డస్ట్ ఎక్కువ

0
TMedia (Telugu News) :

నాణ్యత నగుబాటు
-సిమెంట్ తక్కువ.. డస్ట్ ఎక్కువ
-కూలిపోతున్న డివైడర్
-పట్టించుకోని అధికారులు

( నాగేశ్వరరావు పోలంపల్లి)

టీ మీడియా, జూలై 25, ఖమ్మం రూరల్ : అధికారుల నిర్లక్ష్య వైఖరి కొందరు కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తోంది.. కోట్ల రూపాయలతో చేపడుతున్న పనుల్లో నాణ్యత కొరవడుతోంది.. కాంట్రాక్టర్లు, అధికారుల జేబులు నిండుతున్నాయే గానీ పనులు మాత్రం నాణ్యంగా జరగడం లేదు.. దీంతో నిర్మాణం చేపట్టిన కొద్ది రోజులకే కూలిపోతున్నాయి..

 

Also Read : భార్యాభర్తల బదిలీలను వెంటనే చేపట్టాలి

రూ. 17 కోట్లతో..
ఖమ్మం జిల్లానేలకొండపల్లి మండలంలోని చెరువుమాదారం క్రాస్ రోడ్డు నుంచి బౌద్ద స్థూపం రహదారి వరకు రూ. 17 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు,సైడ్ డ్రైన్, డివైడర్ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే పనులు చేపట్టిన కొద్ది రోజులకే డివైడర్ కూలిపోవడం, పగుళ్లు ఏర్పడం చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ అధికార్లతో కుమ్మక్కై నాసిరకంగా నిర్మాణం చేపట్టడం వల్లనే డివైడర్ అక్కడక్కడ కూలిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అటో రాసుకున్నా అంతే..!
అటో రాసుకున్నా బైక్ డీ కొన్నా చివరకు గట్టిగా తన్నినా కూలిపోతుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించనందునే కూలిపోతున్నట్లు విమర్శలున్నాయి.

సిమెంట్ తక్కువ.. డస్ట్ ఎక్కువ
డివైడర్ నిర్మాణం లో సిమెంట్ తక్కువ కలిపి డస్ట్ ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నాణ్యత లేని ఇసుక, కంకర వాడడం వల్ల నాలుగు కాలాల పాటు ఉండాల్సిన డివైడర్ రెండు, మూడు నెలలకే కూలిపోతుంది.

 

Also Read : డీజేఫ్ జిల్లా అధ్యక్షునిగా తీగల శ్రీనివాస్ రావు నియామకం

పర్యవేక్షణ లేని కారణంగా..
నిర్మాణం చేపట్టే సమయంలో అధికారుల పర్యవేక్షణ సరిగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడేదికాదు. దీనికి తోడు జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం వల్లే కింద స్థాయి అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చే ముడుపులకు అలవాటు పడి నిర్మాణం జరిగే సమయంలో చూసీ, చూడనట్లు వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా మండలంలో చేపట్టిన కొన్ని నిర్మాణ పనుల్లో కొన్ని లక్షల రూపాయలను మింగేశారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే ఆపివేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube