రాజీనామా చేస్తా అన్నావు ఏమైంది రేవంత్

విలేకర్ల సమావేశంలో మంత్రులు,ఎమ్యెల్సి

1
TMedia (Telugu News) :

రాజీనామా చేస్తా అన్నావు ఏమైంది రేవంత్
-పాల్వంచ లో కబ్జా చరిత్ర నీది
విలేకర్ల సమావేశంలో మంత్రులు,ఎమ్యెల్సి

టి మీడియా, ఎప్రిల్ 27,ఖమ్మం:టిఆర్ఎస్ జిల్లాపార్టీకార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , సంక్షేమ శాఖ అభివృద్ది శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ , జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఇతరప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. మంత్రి పువ్వాడ హైలైట్స్.కొడంగల్ లో ఓడిపోతే రాజకీయసన్యాసంతీసుకుంటననిఅన్నావు గుర్తుందా అంటు రేవంత్ మాట్లాడిన వీడియో చూపించారు.సుపారి పిసిసి వి నువ్వు. నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు.నువ్వు ఖమ్మం వచ్చింది రాహుల్ సభ కోసం.వచ్చిన పని వదిలేసి పువ్వాడ నామస్మరణనే ఎక్కువ చేశావు.కళాశాల మీద గవర్నర్ కు ఫిర్యాదు చేసి ఏం సాదించినవ్.ఖమ్మం నగరంలో మమత కళాశాల 25 ఏళ్ళ ప్రతిష్టాత్మకమైన్ కళాశాల.. ఎంతో పారదర్శకంగా నడుస్తున్న కళాశాల రా చూస్కో ఏం చూసుకుంటావో చూస్కో.. ఎం చేసుకుంటావో చేస్కో.దగ్గరుండి చూపించే పంపుతాం.పాలకుడు శక్తి మంతుడు అయినప్పుడు శత్రువులు అంతా ఏకమై వస్తారు అన్న చాణక్యుడు నీటి నీ గుర్తు చేశారు.

 

Also Read : తిరుమల కొండపై సినిమా పాటల వివాదం..

 

2దశల్లో వచ్చిన కరోనా అన్న పోయింది కానీ రేణుక అనే దరిద్రం ఇంకా ఖమ్మం నుండి పోలేదు.. ఏం కర్మ ఇది.కేసుల గురించి మాట్లాడుతుంది రేణుక.. మా తెరాస ఉద్యమ నాయకులపై ఎంత మంది మీద పెట్ట కున్నావు నువ్వు కేసులు.గుర్తులేదా..?20 సంవత్సరాలు ఖమ్మంలో ప్రజాప్రతినిధిగా ఉన్నావు.ఏం చేశావో చెప్పు తట్టడు మట్టి పోయాలే. ఒక్క పనిచెయ్యాలే.. కేవలం పదవిని ఎనుభవింది విలాసాలుఅనుభవించావు.నొట్లకొసంసీట్లుఅమ్ముకున్నవు.సీట్లు ఇస్తా ఆని డబ్బులు దండుకుని గిరిజన డాక్టర్ రంజీ ప్రాణాలను బలిగోన్నవు. నీకు సిగ్గుందా అసలు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పాల్వంచలో ఎకరాలకు ఎకరాలు కబ్జా చేశావు. ఎవరికి తెలియదు నీ బాగోతం.నీ బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పెడితే కానీ శాంతించవా.మాకు సంస్కారం ఉంది, చదువుకున్నాం.. విజ్ఞత ఉండి. నువ్వు మహిళ వు కాబట్టి ఎక్కువ మాట్లాడటం లేదు.. లేదంటే నీకు ఎలా బుద్ధి చెప్పాలి.. ఎక్కడ చెప్పాలో మాకు బాగా తెలుసు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube