బ్యాంకు లోన్ల వసూలు ఓటీస్ ద్వారా వచ్చిందెంతా? ఎంపీ నామ నాగేశ్వర రావు
బ్యాంకు లోన్ల వసూలు ఓటీస్ ద్వారా వచ్చిందెంతా? ఎంపీ నామ నాగేశ్వర రావు
బ్యాంకు లోన్ల వసూలు ఓటీస్ ద్వారా వచ్చిందెంతా? ఎంపీ నామ నాగేశ్వర రావు
టీ మీడియా,మార్చి 22,న్యూఢిల్లీః ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల్లో లోన్ల రాబడికి వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా కేంద్రం తీసుకున్న నిర్ణయాల ద్వారా వసూలు ఎంత అయిందని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, నామ నాగేశ్వర్రావు ప్రశ్నించారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనల ప్రకారం… నాన్ పర్ఫామింగ్ అసెట్స్(ఎన్పీఏ)లకు వన్‌టైం సెటిల్మెంట్ గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ. 60,940 కోట్లు వసూలు అయినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ వెల్లడించారు. అయితే, బ్యాంకింగ్ కంపెనీస్ చట్టం సెక్షన్ 13 ప్రకారం ఆయా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారు(బారోవర్స్) వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేశారు. అయితే, అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడా… అత్యల్పంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా ఎన్పీఏలను పరిష్కరించుకున్నట్టు వివరించారు.
Also Read : శివ కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన: మున్సిపల్ పాలకవర్గం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube