ఎస్సి, ఎస్టి అట్రాసిటి కేసులపై త్వరితగతిన చర్యలు

కలెక్టర్ వి.పి. గౌతమ్

1
TMedia (Telugu News) :

ఎస్సి, ఎస్టి అట్రాసిటి కేసులపై త్వరితగతిన చర్యలు

-కలెక్టర్ వి.పి. గౌతమ్

టి మీడియా, జూలై 01,ఖమ్మం: ఎస్సి, ఎస్టి అట్రాసిటి కేసులు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పోలిస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్ తో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి ఎస్సి, ఎస్టి విజిలెన్స్ కమిటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

ఎస్సీ, ఎస్టీలపై దాడులను పర్యవేక్షించే విజి లెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలను ప్రతి మూడు నెలలకో సారి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సి, ఎస్టి జనాభా ఎక్కువ వున్న గ్రామాల్లో ప్రతి నెల 30న రెవెన్యూ, పోలీసుశాఖ సిబ్బంది గ్రామాల్లో సివిల్‌ రైట్స్‌ దినం నిర్వహించి ఎస్సీ, ఎస్టీ హక్కులపై అవగాహన కల్పించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే త్వరితగతిన విచారణ చేపట్టి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు, చెల్లింపుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

 

Also Read : సాగు రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్

 

అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిన నిబంధనల మేరకు పరిహారం చెల్లింపు కోసం పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆశా వర్కర్స్, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఆర్పిలు,ల్ గ్రామ దీపికలకు అన్ని పధకాలకు లబ్దిదారులుగా ఉంటారన్నారు. దళితబందు పై దళితసంఘాలు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటుచేసి, సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు.పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఎక్కడ జరిగినా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా చర్యలు తీసుకుం టామన్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. జిల్లాలో 42 ఎస్సీ, ఎస్టీ కేసులు విచారణలో ఉన్నాయన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, అదనపు దిసిపిలు షబరీష్, ఏఎస్ సి బోస్, జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, ఆర్డివోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, ఏసిపిలు, కమిటి సభ్యులు జి. వీరభద్రం, జె. దాస్ మహారాజ్, టి. అంజయ్య, ఏ. శ్రీనివాస్, ఎం. వెంకట్, పి. శ్రీనివాస్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube