సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు

కలెక్టర్ విపీ గౌతం

0
TMedia (Telugu News) :

సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు

– కలెక్టర్ విపీ గౌతం

టీ మీడియా, ఫిబ్రవరి 20,ఖమ్మం : ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయల భవన సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘‘గ్రీవెన్స్‌ డే’’ లో పలు సమస్యలకు సంబంధించి అర్జిదారుల నుండి దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార చర్యలకై ఆదేశించారు.
మంగాపురం గ్రామంకు చెందిన గుగ్గులోతు భేఖరే తన భర్త మరణించారని, తన కుమారుడు తనను చూడటం లేదని తన ఎకరం భూమిని తన పేరున మార్పుచేసి ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారికి సూచించడం జరిగింది. రఘునాథపాలెంకు చెందిన గాజుల వెంకటేశ్వర్లు తనకు ఆసరా పెన్షన్‌ మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు.

మధిర మండలం అంబారుపేటకు చెందిన రేపాకుల శ్రీలక్ష్మీ తన భర్త విష్ణుకుమార్‌ పేరున నేలకొండపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెం.1173, 1171 లో ప్లాట్‌ నెం.47, విస్తీర్ణం193.33 చదరపు గజములు కొనుగోలు చేయడం జరిగిందని, తేది.15`9`2019న మరణించినారని తమ అత్త, మామలు కలిసి తనకు తెలియకుండా ఖమ్మం నివాసి ఆయిన ఈదు ప్రసాదుకు రిజిష్ట్రరు చేసినారు అట్టి రిజిస్ట్రేషన్‌ను రద్దుపరిచి తను తన కుమారుడు రేపాకుల విష్వంత్‌రాజ్‌ పేరున మార్పు చేయగలరని సమర్పించిన దరఖాస్తును విచారణ చేసి తగు చర్యకై జిల్లా రిజిష్ట్రార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. సత్తుపల్లి మండలం అయ్యగారిపేటకు చెందిన బోయపాటి లలితకుమారి ధరణిపోర్టల్‌లో మిస్సింగ్‌ సర్వేనెం.123/ఉ/అ/1, దరఖాస్తు చేయడం జరిగిందని అట్టి సమస్యను పరిష్కరించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్యకై కల్లూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారికి సూచించారు. మధిర మండలం మాటూరు గ్రామంకు చెందిన మోదుగు దానియేలు మాటూరు గ్రామ రెవెన్యూలో సర్వేనెం.955లో గల ఎ0`20 కుంటల భూమిని 20 సంవత్సరంల నుండి సాగు చేసుకోవడం జరిగిందని అట్టి భూమి తన స్వాధినంలో సాగులో ఉందని అట్టి భూమిని తన పేరున నమోదు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్యలకై మధిర తహశీల్దారును ఆదేశించారు. ఖమ్మం నగరం 1వ డివిజన్‌ కైకొండాయిగూడెంకు చెందిన గుర్రం వెంకటరామయ్య తన తండ్రి గుర్రం భాస్కరయ్య, వారి అన్నగారు గుర్రం రామయ్య, తమ్ముడు గుర్రం నర్సయ్య ముగ్గురి పేరుమీద ఖమ్మం అర్బన్‌ రెవెన్యూ మల్లెమడుగు రెవెన్యూ గ్రామం 413/అ1 సర్వేనెంబర్‌లో 8 ఎకరాల 4 కుంటల భూమి జాయింట్‌ పట్టాగా కలదని,

Also Read : విద్యార్థులు క్రమశిక్షణ తో చదువుకోవాలి

ప్రస్తుతం రికార్డులో గుర్రం నర్యయ్య ఒక్కరి పేరున నమోదు కావడం జరిగిందని అట్టి సమస్యను పరిష్కరించి అట్టి 8 ఎకరముల 4 కుంటల భూమిని ముగ్గురికి సమభాగములుగా నమోదు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్యకై అర్బన్‌ తహశీల్దారును ఆదేశించారు. కొణిజర్ల మండలం పెద్ద మునగాల గ్రామంకు చెందిన తడికమళ్ళ నాగేశ్వరరావు, స్వాతి దంపతులకు ఇద్దరు అంగవైకల్యం కలిగిన పిల్లలకు దివ్యాంగుల పించను, దళితబంధు పథకం మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి కలెక్టర్‌ సూచించారు.అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌.మధుసూదన్‌, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, రెవెన్యూ డివిజనల్‌ అధికారి రవీంధ్రనాద్‌, జిల్లా స్థాయి అధికారులు తదితరులు గ్రీవెన్స్‌ డే లో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube