టి మీడియా, నవంబర్ 5 ములుగు
సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి రైతన్న సినిమా షూటింగ్ సందర్భంగా ములుగు రావడంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్యే క్యాంపులో గురువారం కలిసారు.
రైతన్న సినిమాకు సీతక్కను ఆర్ నారాయణ మూర్తి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు రైతులు పడిన బాధలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాలు, వాటి వలన రైతులు ఎదుర్కోబోయే సమస్యలను రైతన్న సినిమాలో చూపించనున్నట్లు తెలిపారు. రైతన్న సినిమాను ఆశీర్వదించాలని ఆర్నారాయణ మూర్తి సీతక్కను కోరారు.