గులాబీకి గుడ్ బై చెప్పిన రామన్నగూడెం….

సర్పంచ్ పాలకమండలి సభ్యులతోపాటు 160 కుటుంబాలు

1
TMedia (Telugu News) :

గులాబీకి గుడ్ బై చెప్పిన రామన్నగూడెం….
సర్పంచ్ పాలకమండలి సభ్యులతోపాటు 160 కుటుంబాలు
టీ మీడియా ,జూన్ 29, అశ్వారావుపేట: మండలంలో తెరాస పార్టీ కి షాక్ మీద షాక్ తగులుతుంది.మొన్ననే ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తాటి వెంకటేశ్వర్లు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేరిన విషయం మరువక ముందే,పోడు భూముల వ్యవహారంలో తెరాస ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రామన్నగూడెం ప్రజలు వాపోయారు, ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదని,ఈ క్రమంలో తమ గోడు వెళ్ళేబుచ్చుకొనేందుకు శాంతి యుతంగా ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన తమను పోలీసుల చేత విచక్షణ రహితంగా వ్యవహరించి ముల్కలపల్లి,కిన్నెరసాని స్టేషన్ లకు తరలించరని మేము ఏ పాపం చేసాం అని,ఇంత ఘోరంగా వ్యవహరించారని గ్రామ సర్పంచ్ మడకం స్వరూప మంగళవారం రామన్నగూడెం గ్రామాల్లో విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీశారు.

Also Read : బరుతెగించిన ప్రవైట్ వైద్యం

సొంత పార్టీ నాయకులం అయిన మమ్మల్ని,మా గ్రామ ప్రజలపై ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఇక్కడ నాయకులు ఒక్కళ్ళు కూడా ఖండించలేదని ఇంత జరిగినా ఈ పార్టీలో కొనసాగడం సిగ్గుచేటని అందుకే నేను నాతో పాటు పంచాయితి పాలకమండలి సభ్యులు,అలాగే రామన్నగూడెం 160 కుటుంబాలు మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కి రాజీనామా చేస్తూన్నాం అని భవిష్యత్ కార్యాచరణ త్వరలో తెలియచేస్తాం అని అన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube